Parakala | ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..

Parakala | ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..
21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సూదమల్ల రమేష్ ఇంటింటి ప్రచారం
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 21 వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సూదమల్ల రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పట్టణంలోని 21వ వార్డులో ఓటర్లను కలుస్తూ సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం చేస్తామని ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ హామీ ఇవ్వడం జరిగింది. అభ్యర్థి రమేష్ మాట్లాడుతూ తమకు కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. 21వ వార్డులో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తాను అన్నారు. వార్డులోని ఓటర్ల ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి రమేష్ వెంట ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాఫర్ రిజ్వి, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
