Parakala | ప్రజల సమస్యలు పరిష్కారం…

Parakala | ప్రజల సమస్యలు పరిష్కారం…
- కల్వర్టు ర్యాంప్ నిర్మాణం
- డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేందుకు మరమ్మత్తులు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం తొమ్మిదో వార్డు పరిధిలో ప్రజల సమస్యలపై 9వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి విశేష సేవలు అందిస్తున్నారు. పురపాలక సంఘం తొమ్మిదో వార్డు పరిధిలోని శ్రీనగర్ కాలనీలోకి వెళ్లే దారిలో డ్రైనేజీ కల్వర్టు వద్ద ర్యాంప్ నిర్మాణ పనులు చేపట్టి వాహనదారులు, పాదచారులు వెళ్లడానికి దారిని సుగుమం చేశారు. అదేవిధంగా తొమ్మిదో వార్డు పరిధిలోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లకుండా నిలిచిపోయిన క్రమంలో డ్రైనేజీ మరమ్మత్తులు పనులు చేపించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస కాలనీ ప్రజలు తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
