పాండాలు.. చూడబోతే..

నర్సంపేట, క్రైమ్, ఆంధ్రప్రభ : వీధిలో పెళ్లి పాండాలు చూడడానికి సంతోషంగా సైకిల్ పైన వెళ్లిన బాలుడు కరెంటు షాక్ తో మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు కల్ముకున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు మాదన్నపేటలో శుక్రవారం ఉదయం దూడల సతీష్ జ్యోతిల ఏకైక కుమారుడు దూడల అభినవ్(9) కరెంటు షాక్ తో మృతి చెందడం తో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

మాదన్నపేటలో పెండ్లికి పాండాలు వేస్తున్నారన్న విషయం తెలియగానే పలువురు బాలురు సైకిళ్లపై చూడడానికి వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పుకోవడం కోసం గోడను పట్టుకోవడంతో కరెంటు షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కరెంటు స్తంభం నుండి తీసిన సర్వీస్ వైరు గాలి రాపిడికి తెగిపోయి రేకులకు కరెంటు సరఫరా అవుతుంది.

దీంతో గోడకు కూడా కరెంటు ప్రవహించడంతో దానిని పట్టుకున్న అభినవ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంటికి సంబంధించిన వారు చాలా కాలంగా గ్రామములో ఉండడం లేదని తెలిసింది. కండ్ల ముందు తిరిగాడిన కుమారుడు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో సతీష్ జ్యోతిలు, కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. దీంతో మాధన్నపేటలో విషాదశాయలు అలుముకున్నాయి. నర్సంపేట లో పోస్ట్ మార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply