ADB | గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

జన్నారం, మే 28 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి పంచాయతీ కార్యదర్శి ఎర్రోజుల చంద్రమౌళి(58) ఇవాళ‌ గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు ఇంట్లో కుర్చీలో కూర్చుని గుండెపోటుకు గురై అక్కడిక‌క్క‌డే మృతిచెందాడు. గత రెండు సంవత్సరాలుగా ఇందనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రమౌళి గ్రామ ప్రజలతో, అధికారులతో కలివిడిగా ఉండేవారు. మృతుడు జగిత్యాల జిల్లా వాసి. మృతునికి భార్య పద్మతో పాటు కుమారుడు ఉదయ్, కుమార్తె మేఘన ఉన్నారు.

చంద్రమౌళి మృతిచెంద‌డంతో ఆయ‌న‌ భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లాకావత్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మృతదేహాన్ని ఎంపీడీవో హుమార్ షరీఫ్, ఎంపీఓ జలంధర్, పలువురు పంచాయతీ కార్యదర్శులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.

Leave a Reply