Pamireddypally | అభివృద్ధికి పట్టం కట్టండి..

Pamireddypally | అభివృద్ధికి పట్టం కట్టండి..
Pamireddypally, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పామరెడ్డి పల్లి గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటి ప్రచారాన్ని మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి కొనసాగించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్యపు రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని అభివృద్ధి కోసం కృచేసిన వారికే పటం కట్టాలని.. బరిగే జ్ఞానేశ్వర్ కి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే గ్రామం అభివృద్ధి చెందిందని అన్నారు. మన గ్రామ ప్రజలు, మహిళలు, రైతులు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఉంగరం గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
