Pamarru | ముమ్మర ఏర్పాట్లు…

Pamarru | ముమ్మర ఏర్పాట్లు…
- జిల్లా వ్యాప్తంగా పనుల పై దృష్టి సారించిన డీపీఓ
- సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి..
Pamarru | పామర్రు, ఆంధ్రప్రభ : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కె. పవన్ కళ్యాణ్ఆదేశాలతో పి ఆర్ కమిషనర్ కృష్ణ తేజ ఇచ్చిన సూచనలు సలహాలతో గ్రామాలలో సంక్రాంతి పండుగను ఆహ్లాదకర వాతావరణం కలిగించే విధంగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ జె.అరుణ జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీలలో అమలయ్యే విధంగా చర్యలను చేపట్టారు.
దానిలో భాగంగా గ్రామపంచాయతీల్లో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు వచ్చే ప్రజలకు ఇది తమ గ్రామమే నన్న విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో డిపిఓ ముందుకు సాగుతున్నారు. తదనుగుణంగా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీల పేరుతో గ్రామాలలో జరుగుతున్నపారిశుధ్యం నిర్వహణతో పాటు మట్టి దెబ్బలు పేడదెబ్బలు తొలగింపును ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మురుగు కాల్వ లో చెత్తాచెదారాలను తొలగింపుకు చర్యలు తీసుకున్నారు. దానికోసం పక్షం రోజుల నుంచే పంచాయతీ కార్యదర్శులు ఆమె అప్రమత్తం చేసి అన్ని పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిపిఓ ఆదేశాల మేరకు గ్రామ మండల డివిజన్ స్థాయి కేడర్లలో అధికారులు ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామాలను సందర్శించడం సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలిస్తున్నారు.
అలసత్వం వహించే కార్యదర్శులను ఉపేక్షించేది లేదంటూ అరుణ స్పష్టం స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులు అందరూ ఉదయం ఏడు గంటలకే గ్రామాల బాట పట్టి సంపూర్ణ పారిశుధ్య నిర్వహణలో నిమగ్నమయ్యారు.
