Palnadu-Simhadri Express | గేదెను ఢీకొనడంతో…

Palnadu-Simhadri Express | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. గేదెను ఢీకొనడంతో రైలు కొంతసేపు పట్టాలపై నిలిచిపోయింది.
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఓ గేదెను ఢీకొనడంతో అది రైలు చక్రాల కింద ఇరుక్కుపోయింది.
అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
