Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

  • అప్పుడు ప్రేమ పెళ్లి
  • ఇప్పుడు డల్వన్మరణం
  • ఓ యువజంట విషాదాంతం
  • చిన్నారి అనారోగ్యం…
  • అమ్మానాన్న ఆవేదన
  • భవిష్యత్తుపై భయం…
  • తట్టుకోలేని మానసిక ఒత్తిడి
  • ముగ్గురు ఆత్మహత్య కు లాడ్జిలో నిర్ణయం
  • చివరి మెసేజ్‌తో బయటపడిన ఘటన

(న‌ర‌స‌రావుపేట‌, ఆంధ్రప్రభ) :

పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి మనసుని కలచివేస్తోంది. జీవితాన్ని ప్రేమతో మొదలుపెట్టిన ఒక జంట… తమ ప్రేమకు ప్రతిరూపం చిన్నారి భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ చివరికి అదే ఆవేదనలో కన్నబిడ్డతో సహా ప్రాణాలు వదిలేసిన ఓ యువ దంపతుల హృదయ విదారక గాథ ఇది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన కుంభా గోపి, ధర్మవరానికి చెందిన శంకరకుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ భోపాల్‌లోని ఎయిమ్స్‌లో వైద్య రంగంలో పనిచేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్నారు. వారి జీవితం మరింత ఆనందంగా మారాల్సిన సమయంలో, కుమార్తె మౌనిహ పుట్టింది. అయితే ఆ చిన్నారి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లోపించడం వారి జీవితాన్ని మెల్లగా కలవరపరిచింది.

Palnadu Family Suicide : బిడ్డ వ్యథ తట్టుకోలేక..

మూడేళ్ల తమ బిడ్డ బాధను చూస్తూ తల్లిదండ్రులు ప్రతి రోజూ మానసికంగా కుంగిపోయారు. ఆమె కోసం ఎంత చేసినా ఫలితం లేకపోవడం… భవిష్యత్తుపై భయం… సమాజం ముందు నిలబడే ఆందోళన—ఇవన్నీ వారిని లోపల నుంచి నిశ్శబ్దంగా వారిలో పెరుగుతూ వచ్చాయి. కొద్ది రోజుల క్రితం శంకరకుమారి తన పుట్టింటికి వెళ్లింది. గోపి కూడా ఆమెను, చిన్నారిని కలిసేందుకు వచ్చాడు.అయితే ఆ కలయిక చివరి కలయికగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. శనివారం రాత్రి ముగ్గురు నరసరావుపేటలోని ఒక లాడ్జిలో దిగారు.అక్కడే జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.మత్తు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత, గోపి తన సోదరికి పంపిన సందేశం—

Palnadu Family Suicide : “మేము చనిపోతున్నాం…”

అది వారి చివరి పిలుపు. ఆ సందేశం చూసి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సరికి ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా, చిన్నారి మౌనిహ… తల్లి శంకరకుమారి అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. జీవితంతో పోరాడిన గోపి కూడా చివరికి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు…మానసిక ఒత్తిడి, నిరాశ, సహాయం కోరలేని పరిస్థితులు ఎంత ప్రమాదకరమో గుర్తుచేస్తోంది.

Leave a Reply