Palnadu Mu*der| అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక…

Palnadu Mu*der | అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక…

  • బావను చంపేశా .. ప్రధాన నిందితుడి కథనం

ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో : సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో ఆదివారం మధ్యాహ్నం తల్లి ,కోడుకు పై కిరాతక దాడి నేపథ్యంలో.. ముగ్గురు మైనర్లు తెరమీదకు వచ్చారు. ఈ ముగ్గురూ హంతకులుగా మారటానికి కారణమేంటీ? అసలు కథేంటీ? నిజాలు తెలిస్తే గుండె ఝల్లుమనాల్సిందే..!!!

ఈ ముగ్గురూ పదవ తరగతి పూర్తి చేశారు. జూనియర్ ఇంటర్మీడియట్ కేడర్ లో ఉన్నారు. ఒకరు పాలిటెక్నిక్ కోర్సులో ఫస్టియర్ కాగా.. మిగిలిన ఇద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అకస్మాత్తుగా హంతకులుగా ఎందుకు మారారు. ఇందులో సినిమా కథలు వినిపిస్తాయి.

దూళిపాళ గ్రామానికి చెందిన హతుడు సాంబశివరావుకు నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందినఓ పాలిటెక్నిక్ విద్యార్థి అక్కతో మూడేళ్ల కిందట వివాహమైంది.

కొద్ది రోజులకే సాంబశివరావు తన భార్యతో మనస్పర్థలు పెంచుకున్నాడు. తన భార్యను సాంబశివరావు పూర్తిగా వ్యతిరేకించాడు. ఈ మనో వేధన భరించలేక అతడి భార్య ఇటీవలే విడాకులు తీసుకుంది.

మూడేళ్ల కిందట అంటే.. సాంబశివరావు బావమరిది వయస్సు 13 ఏళ్లే. తాను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుంచి తన ఇంట్లో తన అక్క కంటతడి పెట్టటాన్ని ఈ మైనరు భరించలేక పోయాడు.

కక్ష పెంచుకున్నాడు. తన అక్క కాపురం కూలిపోగా.. ఇంటాబయట ఆమె అవమానాలు ఎదుర్కొందనే అక్కసుతో కక్ష పెంచుకున్నట్టు ప్రధాన నిందితుడు పోలీసులకు వివరించాడు. తన అక్క కళ్లల్లో నీరు చూడలేకపోయాయనని, ఆమె కోసమే తన భావను చంపేశానని ఈ బాలుడు వివరించాడు.

తన భావ దుర్మార్గుడని, మరో అక్కకు ఇతడు భర్త కాకూడదనే చంపేశానని చెప్పాడు. ఇక కౌమర దశలోనే కక్షను పెంచుకున్న ఈ మైనరుకు ఇద్దరు స్నేహితులూ.. తన ఫ్రెండ్ కళ్లల్లో ఆనందం కోసం హత్య చేసినట్టు చెబుతుంటే.. జనం ఆశ్చర్యపోనక్కరలేదు.

ఈ హత్య ఎలా జరిగిందంటే.. ముగ్గురు స్నేహితులు ఆదివారం మద్యాహ్నం దూళిపాళ్ల గ్రామానికి చేరుకున్నారు. సాంబశివరావు ఇంటికి వెళ్లారు. కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారిపైనా దాడి చేశారు.

ఇదీ పోలీసుల కథనం. ఇక ఆమెను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించగా.. చాగల్లు గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తల్లీ కొడుకు పీకలు కోశారు..

Leave a Reply