Palnadu | గొర్రెల మందపై… కుక్కల దాడి..

Palnadu | గొర్రెల మందపై… కుక్కల దాడి..

  • అక్కడికక్కడే 32 గొర్రెలు మృతి..
  • 2.50 లక్షల రూపాయల నష్టం..

Palnadu | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలంలో మూగజీవాల పై కుక్కలు విరుచుకుపడ్డాయి. తాడువాయి గ్రామంలో అదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానిక రైతు కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. వివరాల్లోకి వెళ్తే… అచ్చంపేట మండలం, తాడువాయి గ్రామానికి చెందిన రైతు కొజ్జా వెంకటేశ్వర్లు (చిన్నోడు) గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే తన గొర్రెల మందను దొడ్డిలో ఉంచారు. అదివారం తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కుక్కల గుంపు మంద పై ఒక్కసారిగా దాడి చేశాయి.

ఈ దాడిలో సుమారు 32 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న జీవాలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి రైతు వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో తనకు సుమారు 2 లక్షల 50 వేల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వెంకటేశ్వర్లు వేడుకుంటున్నారు.

Leave a Reply