బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : షిర్డీలో గురువారం నిర్వహించిన సాయిబాబా పల్లకి సేవలో బెల్లంపల్లి సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. పల్కి నివార్ నుంచి ద్వారకామాయి, అక్కడి నుంచి కండోబా మందిరం మీదుగా ప్రధాన మందిరం వరకు భక్తులు సాయిబాబా పల్లకిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. సుమారు 200 మంది భక్తులు ఆటపాటలు, బాజా భజంత్రీలు, కోలాటాల సందడితో పల్లకి సేవను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సాయిబాబా ఆలయ సేవకులు ఆవునూరి దుర్గయ్య, ఆకుల కుప్పు స్వామి, సుద్దాల శ్రీనివాస చారి, కుంభాల రాజేష్, ఎనగందుల దత్తు, ఎనగందుల చరణ్, మేడి గోపాల్, పీక. చాణక్య, మంతెన కిరణ్, దర్శన్, కుడికాల శివశంకర్, సాయిశ్వర్, సాయి, రాఘవ, అవునూరి నవీన్, ఆకుల లలిత, సుద్దాల సాహితి, లక్ష్మి, శైలజ, సుగుణ, బాయమ్మ, కనకమ్మ, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

