Palasa | జిల్లుండా గ్రామంలో అగ్నిప్రమాదం…

పలాస (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : మందస మండలం జిల్లుండా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లి లక్ష్మణరావు పంట పొలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలకు అకస్మాత్తుగా నిప్పు అంటుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా ధాన్యం దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు మరింత విస్తరించకుండా నివారించారు.

ఈ ప్రమాదంలో సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం అగ్నికి ఆహుతైందని అంచనా… అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టిన అధికారులు, రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఘటనపై గ్రామంలో ఆందోళన నెలకొంది.

Leave a Reply