IND vs PAK | దాయాదుల పోరులో టాస్ గెలిచిన పాక్ !

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్‌కు దుబాయ్ వేదికైంది. కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తుది జట్లు

టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

పాకిస్థాన్ : బాబర్ అజామ్, ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీప‌ర్), తయ్యబ్ తాహిర్, అఘా సల్మాన్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

జట్టు మార్పులు:

పాకిస్థాన్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. స్టార్ ప్లేయర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా దూర‌మవ్వ‌గా.. అత‌డి స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి వచ్చాడు.

విజ‌యోత్సాహంతో భార‌త్ !

ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవ‌రేట్ గా బ‌రిలోకి దిగ‌నుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై గెలిచిన భారత్.. విజ‌యోత్సాహంతో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు చేరుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది.

మ‌రోవైపు ఈ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది. దీంతో టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూ ఆర్ డై మ్యాచుగా మారిపోయింది. పాకిస్థాన్ జ‌ట్టు ఈ మ్యాచ్ ఎల‌గైనా గెలిచి సెమీస్ రేసులో ఉండాలని భావిస్తోంది.

అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్థాన్ ఇంటిముఖం పట్టనుంది. మరోవైపు ఈ మ్యాచులో గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారడంతో… నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *