Padmajiwadi | అభివృద్ధి ధ్యేయం..

Padmajiwadi | అభివృద్ధి ధ్యేయం..
Padmajiwadi, సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో మంచి మార్పును చూపడానికి అన్నివర్గాలతో మమేకమై.. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని.. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన లోకోటి సుబ్బారావు ప్రచారం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని ప్రజల నుండి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ప్రతి నెల ఒక ఆదివారం పద్మాజివాడి ఎక్స్ రోడ్ లో రేషన్ సరుకుల పంపిణీ, గ్రామంలో గల్లి గల్లికి డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, ఎక్స్ రోడ్ లో త్రాగునీటి కోసం సొంత నిధులతో బోరు వేయించడం, క్రీడల పై ప్రత్యేక కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఏడాదికి ఒకసారి మెగా వైద్య శిబిరం ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల కమీషన్ కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.
