padma l 10వ వార్డులోఢీకొండ పద్మను గెలిపించుకుంటాం..

padma l 10వ వార్డులోఢీకొండ పద్మను గెలిపించుకుంటాం..
వార్డు అభివృద్ధికి పద్మక్కనే కౌన్సిలర్ గా గెలవాలి
ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్న ఓటర్లు
padma l బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని డీకొండ పద్మ చేపట్టిన ప్రచార ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆశీస్సులతో బరిలో ఉన్న పద్మకు వార్డు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. చేపట్టిన ప్రచారంలో ప్రతి గల్లీలోనూ మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పలుకుతుండటంతో 10వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగా డీకొండ పద్మ ఓటర్లకు కీలక హామీలిచ్చారు. ముదిరాజుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్, భక్తి శ్రద్ధలకు నిలయమైన పెద్దమ్మ టెంపుల్ అభివృద్ధి, అలాగే అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రైల్వే హమాలీల కష్టాలను గుర్తించి, వారి కోసం ప్రత్యేకంగా ‘హమాలీ భవన్’ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. “మీరు నన్ను గెలిపించిన మూడు నెలల్లోనే ఎమ్మెల్యే వినోద్ సహకారంతో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాను” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలే తమను గెలిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. వార్డులో ఉన్న 1,056 మంది ఓటర్లలో మెజార్టీ ఓటర్లు పద్మక్క వైపు మొగ్గు చూపుతున్నారు. “పద్మక్క మన ఇంటి ఆడబిడ్డ.. ఆమె ఎప్పుడూ మన కష్టసుఖాల్లో తోడుంటుంది” అని వార్డు మహిళలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడంతో 10వ వార్డులో హస్తం విజయం నల్లేరుపై నడకేనని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
