ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం

అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ

పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి..

ఐక్యతతో ఏదైనా సాధ్యం

..మన ఇందూర్ మన మేయర్ ” అన్న నినాదం ప్రజల్లో నిజమై నిలుస్తోంది..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయ మని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందనీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభ్యర్థులం తా ఐక్యంగా పనిచేస్తే ఇందూర్‌లో ఘన విజయం ఖాయమని అర్బన్ ఎమ్మె ల్యే స్పష్టం చేసారు. సోమవారం ఓ ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడారు.

గత రెండు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఇందూ ర్‌కు ప్రాతినిధ్యం వహిస్తు న్న కాలంలో, నగర అభి వృద్ధి కోసం సుమారు రూ. 130 కోట్ల నిధులను తీసు కురావడం జరిగింద న్నా రు. ఇటీవలి కాలంలో టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ప్రతి డివిజన్‌కు రూ.1 కోటి చొప్పున అభివృద్ధి పనుల కు శంకుస్థాపనలు చేసిన ట్లు తెలిపారు.

డివిజన్ కి రూ.కోటి రూపాయల నిధు లతో సమగ్ర అభివృద్ధి పనులు జరగబోతున్నా యన్నారు. రోడ్లు, డ్రైనే జీ, తాగునీరు, విద్యు త్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించ నున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.23 కోట్లతో నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నా రు.

రానున్న ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఈసారి తప్పకుండా భార తీయ జనతా పార్టీదేనని ధీమా వ్యక్తం చేసారు. నగ రంలో నిర్వహించిన అన్ని సర్వేలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడిం చారు.

ఇందూర్ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాల నకు మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే “మన ఇందూర్ మన మేయర్ ” అన్న నినాదం ప్రజల్లో నిజమై నిలుస్తోందని తెలి పారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది ఇం దూర్ ప్రజల మనసులోని వాస్తవ స్వరం అని పేర్కొ న్నారు.

Leave a Reply