Orkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఉరుకొండ మండలంలోని బీఆర్ఎస్ మాజీ సర్పంచులను స్థానిక ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ముందస్తు అరెస్టు చేసిన వారిలో ఉరుకొండ మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కొమ్ము రాజయ్య, గుణగుంటపల్లి సర్పంచ్ ఆంజనేయులు, తిమ్మనపల్లి సర్పంచ్ సుదర్శన్, బాల్యలోక తండా సర్పంచ్ శీను నాయక్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన తమకు పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూ సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

