ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం…

ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం…

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆరోగ్యానికి ఆర్గాన్ పంట అమృతం లాంటిదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం భూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం యారం లక్ష్మిరెడ్డి అనే ఉత్తమ రైతుకు చెందిన మిర్చి పంటను ఆయన స్వయంగా పరిశీలించారు. 341 రకం కలిగిన మిర్చి తోటను కేవలం సేంద్రీయ ఎరువులతోనే పెంచి ఎలాంటి పురుగు , రోగం సోకకుండా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఆర్గాన్ మిర్చి పంటను పండించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.

విషపూరిత మందులను వాడి భూమిలో ఉన్న నత్రజని హరింప చేస్తూ వ్యవసాయం చేయటం వలన భూసారం దెబ్బతిని వేసిన పంటలకు రోగాల బారిన పడి పంటల దెబ్బతింటమే కాకుండా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని అలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఆర్గాన్ పంటలు పండించేందుకు సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. యారం లక్ష్మిరెడ్డి అనే ఉత్తమ రైతు గత మూడు సంవత్సరాల నుండి 341 రకం కలిగిన మిర్చిని సేంద్రియ పద్ధతి ద్వారా ఎలాంటి మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం ఆర్గాన్ మిర్చిని ఆరోగ్యానికి అందించడం అభినంద విషయం అన్నారు.

ప్రతి ఒక్కరూ ఆర్గాన్ పంటను పండించేందుకు ముందుకు రావాలని ఉత్తమ రైతు లక్ష్మీ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయం చేయాలని భూమిలో సాంద్రత పెంచి నత్రజని పెంచి పోషించేలా బలం అందించే సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. అనంతరం తానే స్వయంగా రైతు వద్ద నుండి మిర్చిని కొనుగోలు చేసుకున్నారు. ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు ఆర్గాన్మిర్చిని కొనుగోలు చేసుకోవాలని పలువురుకి సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శంకర్, లక్ష్మీపురం సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి , బూర్గంపాడు సర్పంచ్ మంద నాగరాజు ,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, లక్ష్మీపురం ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం రమేష్ రెడ్డి, చిట్టిబాబు, కైపు శ్రీనివాసరెడ్డి, భజన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply