Orders issued | చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు

Orders issued | చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు

Orders issued | విదేశాలు వెళ్లివచ్చినా దోషం ఉండదంటున్న అర్చకులు
పశ్చాత్తాప జపాలు చేసుకుంటే సరిపోతుందంటున్న పండితులు
స్వామీజీలు సైతం విదేశాల్లో పర్యటించి గర్భాలయాల్లో పూజలు
అన్ని శాస్త్రాలు చదివిన స్వామీజీలకు ఆ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్న వైనం
దైవం విశ్వవ్యాప్తం అంటూ సమర్ధింపు
సనాతన ధర్మంపై సందేహాలు పరంపర

అర్చకుల విదేశీయానం వివాదాస్పదం అవుతోంది. సప్త సముద్రాలు దాటి ప్రపంచ దేశాలు చుట్టివచ్చిన వారు గర్భాలయంలో ప్రవేశానికి అనర్హులు అంటూ తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనాత్మకం గా మారింది. ఇది శాస్త్ర విరుద్ధం అని ఓ వర్గం చెబుతుండగా, దైవం విశ్వవ్యాప్తం అని పశ్చాత్తాపాలతో పరిహారం చేసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవని మరో వర్గం భావిస్తోంది. 2010లో ఇచ్చిన ఉత్తర్వులు, శృంగేరీ పీఠం ప్రామాణికం ను అమలు చేయాల్సిందేనంటూ కోర్టు మరోసారి హెచ్చరించింది. ఈ అంశంపై పండిత వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Orders issued | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విదేశీయానం చేసిన అర్చకులు గర్భాలయాల్లో పూజలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు దేవదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకం గా మారింది. సప్త సముద్రాలు దాటి విదేశాలు వెళ్లడం సనాతన ధర్మ విరుద్ధం అని ఆ విధంగా వెళ్లిన అర్చకులను గర్భాలయంలోకి ప్రవేశాన్ని నిషేధించాలి అని తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడిలో ప్రధాన అర్చకులు విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.

Orders issued

వివాదం ఇలా..

దుర్గగుడిలో విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులను గర్భాలయంలో పూజలకు అనుమతిస్తున్నారంటూ దేవస్థానానికి చెందిన పండితులు సుబ్రహ్మణ్యం సోమయాజి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2010లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు శృంగేరీ పీఠాధిపతి ఇచ్చిన ప్రామాణికం ను అమలు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులను గర్భాలయాల్లో పూజలకు వినియోగించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ను ఆదేశించింది. ఈ నిర్ణయంపై పండితుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

దైవం విశ్వవ్యాప్తం..

దైవం ప్రాంతానికి పరిమితం కాదని విశ్వవ్యాప్తం అని పండితులు వాదిస్తున్నారు. విశ్వంలో అర్చకులు ఎక్కడికైనా వెళ్లి పూజలు చేయవచ్చని కూడా అంటున్నారు. విదేశాల్లో పూజలు చేస్తే ఎటువంటి దోషాలు ఉండవని చెబుతున్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లుండడంతో అందుకు సంబంధించి ప్రాయశ్చిత్త పరిహార హోమాలు, జపాలు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. విదేశాలకు అర్చకులు వెళ్లకూడదన్న నిబంధన శాస్త్రాల్లో ఎక్కడా లేదని భగవంతుడు విశ్వవ్యాప్తం అని స్పష్టం చేస్తున్నారు.

కాలానుగుణంగా మార్పులు..

ధర్మ శాస్త్రం ప్రకారం అన్ని జరగాలంటే ఏ ఆలయంలో కూడా ఆ విధంగా జరగవని విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు స్పష్టం చేస్తున్నారు. కఠిన నియమాలు ప్రస్తుత కాలంలో అమలు చేయడం అసాధ్యం అని ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తూ పూజలు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

జగన్మాత విశ్వమాత..

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఓ ప్రాంతానికే పరిమితమైన తల్లి కాదని ఆమె ఈ విశ్వానికి విశ్వమాత గా పూజలందుకుంటున్నారని పండితులు అంటున్నారు. విదేశాల్లో కూడా హిందూ సంప్రదాయాలు, దేవాలయాలు, పూజలు చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కు ప్రాణం పోస్తున్నారు.

గర్భాలయ ప్రవేశం దేవాలయ ధర్మం..

గర్భాలయంలోకి అర్చకుడి ప్రవేశం అనే అంశం కేవలం ఆయా ఆలయాల ధర్మంగా ఉంటుందని ఓ వర్గం స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తామని అధికారులు చెబుతున్నారు.

పరిహార జపాలు, హోమాలు..

ప్రాయశ్చిత్తం చేసుకుంటే దోషం వర్తించదని పండితుల సూచనలతోనే అర్చకులు విదేశాల నుంచి వచ్చాక జపాలు, హోమాలు చేస్తున్నారు. ధర్మ రక్షణ కు విఘాతం కల్పించడం లేదని చెబుతున్నారు.

సుప్రీం తలుపు తడతాం..

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బాధిత అర్చకులు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తిగత లాభం కోసం ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Leave a Reply