హైదరాబాద్‌: గణేశ్‌, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే మండప నిర్వాహకులు తప్పనిసరిగా విద్యుత్ శాఖ నుండి అధికారిక అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది భక్తులు ఎలాంటి అదనపు ఖర్చు భారం లేకుండా ఉత్సవాలను ఆధ్యాత్మికంగా జరుపుకునే అవకాశం లభిస్తుంది.

ఇక ఈ నెల 27వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత దుర్గామాత నవరాత్రులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సౌకర్యంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పండుగ శోభను మరింతగా పెంచనుంది.

Leave a Reply