TG | ఆరెంజ్ అలెర్ట్ జారీ..

TG | ఆరెంజ్ అలెర్ట్ జారీ..

హైదరాబాద్, ఆంధ్రప్రభ – తెలంగాణ (Telangana) రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. రోజురోజుకు ఈ చలి మరింత పెరుగుతోంది. కనిష్ట ఉష్టోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజ గజ వణుకుతోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత పెరుగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, (Manchiryala) జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, (Adhilabad) ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత బాగా ఉండడంతో అక్కడ జనాలు వణికిపోతున్నాయి. మంగళవారం రాత్రి కొమరం భీం (Komarambheem) ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి ఎక్కువుగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుందని.. దీని వలన వైరస్ లు సులభంగా వ్యాప్తి చెందుతాయని.. అందుచేత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

Leave a Reply