Open place | ట్రైనీ ఐఏఎస్ కు కృతజ్ఞతలు..
Open place | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : బంగారు దుకాణాలకు అడ్డుగా ఉన్న మార్కెట్ ను ఓపెన్ ప్లేస్(Open place) కు తరలించేందుకు కృషిచేసిన ట్రైని ఐఏఎస్ అధికారికి బంగారు వర్తకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో ట్రైని ఐఏఎస్ ను మున్సిపల్ కార్యాలయంలో కలిశారు. మేడంను పూలమాల, శాలువాతో సత్కరించారు. తమ షాప్స్ అడ్డంగా ఉన్న కూరగాయల మార్కెట్(market) ద్వారా కలిగే ఇబ్బందులను తెలుపుతూ వ్యాపారులు, అఖిలపక్షం మద్దతుతో గతంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈసందర్భంగా బాధ్యతలో ఉన్న అధికారిణి క్షేత్ర స్థాయిలో సమస్యను గుర్తించి మార్కెట్ ను ఓల్డ్ తహసీల్దార్ ఆఫీస్ ఓపెన్ ప్లేస్(office open place కు తరలించాలని ఆదేశించారు. దాంతో వ్యాపారులు సమస్య పరిష్కరించిన మేడంను వ్యాపారులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వంశీ నర్సయ్య, శ్రీపాద శ్యామ్, శ్రీపాద గోపి, నూనే పురుషోత్తం, దాసు, నరేందర్, విజయ్, యశ్వంత్, ధర్మపురి ఉన్నారు.

