ఎమ్మెల్యే ఆదేశాలతో..

ఎమ్మెల్యే ఆదేశాలతో..

మొవ్వ, ఆంధ్రప్రభ : మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో కొన్ని రోజులుగా వాటర్ పైపులైన్ డ్యామేజ్ అవ్వడంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో, ప్రజల సమస్యను గ్రామస్తులు ద్వారా వెంటనే తెలుసుకొని, పామర్రు నియోజకవర్గ శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా ఆదేశాలతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరాను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, మొవ్వ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లింగమనేని రామలింగేశ్వరరావు అందించారు.

ప్రజల కష్టాల్లో అండగా నిలబడి, తక్షణమే సేవ చేయడం ఆయన పై ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటింది. ఇలాంటి సేవా భావంతో మొవ్వ మండల ప్రజలకు ఎప్పుడూ తోడుగా నిలుస్తున్నలింగమనేని రామలింగేశ్వరరావుకి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రత్యేకంగా ట్యాంకర్ ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు.

Leave a Reply