యాదాద్రి, ఆంధ్రప్రభ : భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి(Swarnagiri) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రేపు ఉదయం పదకొండున్నర గంటలకు మూసివేస్తారు. రాహు గ్రహ గ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా త్రికాల ఆరాధనలు, నివేదనలు పూర్తి చేసుకొని ఆలయ కవాట బంధనం చేయనున్నారు.
అనంతరం సోమవారం ఆలయ శుద్ధి పుణ్యాహవచనం(Punyahavachana) సంప్రోక్షణాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్నం 2 .30 గంటలకు భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించబడుతుందని ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపిక్రిష్ణలు(Gopikrishna) తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం 2 .30 గంటల వరకు స్వర్ణగిరి క్షేత్రంలో అన్ని ఆర్జిత సేవలు, దర్శనాలు నిలిపివేయబడనున్నట్లు చెప్పారు.

