Old City| అగ్ని ప్రమాద బాధితులకు కిషన్‌రెడ్డి పరామర్శ .. కేటిఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 కి మృతుల సంఖ్య చేరినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రమాద ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు . ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఎక్విప్మెంట్స్ పెంచాలని సూచనలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కేటీఆర్‌ దిగ్భ్రాంతి

పాతబస్తీ అగ్ని ప్రమాదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం గురించి వెలువడుతున్న వివరాలు చాలా విచారకరం. ఈ విషాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు

పెను విషాదమే..

పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మృతి చెందారు.అగ్నిప్రమాదంలో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.ప్రమాద సమయంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాద బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు.

ప్రమాదంపై ఫైర్ డీజీ నాగి రెడ్డి మాట్లాడారు. ఫైర్ సిబ్బంది 25 మందికి పైగా కాపాడారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని హాస్పిటల్‌కి తరలించాము. పొగ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు.

మృతుల వివరాలు

ఆరుషి జైన్‌ (17), షీతల్‌ జైన్‌ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్‌ (13), అభిషేక్‌ మోడీ (30), రాజేంద్ర కుమార్‌ (67), ఇరాజ్‌ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్‌ (36), వర్ష (35), రజని అగర్వాల్‌ (32), రిషభ్‌ (4), ప్రీతం అగర్వాల్‌ (1)గా గుర్తించారు.

.

Leave a Reply