OLD BRIDGE | అదుపుతప్పి లారీ బోల్తా..
రైలు కింద పడి లారీ డ్రైవర్ ఆత్మహత్య
OLD BRIDGE | ఆదోని, ఆంధ్రప్రభ : ఆదోని మండల పరిధిలోని బైచిగేరి గ్రామ సమీపంలో ఆదోని నుంచి ఎమ్మిగనూరు (Emmiganur) వైపు వెళ్తున్న లారీ ఆదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలు ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే షాక్ గురైన లారీ డ్రైవర్ లక్ష్మన్న పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది

