OG | “ఫినిష్డ్ ఫైరింగ్”.. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు ఓజీ సిద్ధం !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులను గంభీర అవతారంలో కట్టిపడేయబోతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ నిర్మిస్తున్న OG షూటింగ్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, దుమ్ము రేపే కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. వర్షంలో తడుస్తూ కూడా, ఆ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ చూపించిన యాటిట్యూడ్ అభిమానుల్లో కొత్త ఊపును రేపుతోంది.

కాగా, సుజీత్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ఎంటర్ అయ్యింది. ఇక ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ తో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇమ్రాన్ హాష్మీ, ప్రియాంక అరూల్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్ థమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తుండగా, DVV దానయ్య, కళ్యాణ్ దాసరి డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని ఊపేసిన RRRను నిర్మించిన అదే బ్యానర్ కాబట్టి, OG 2025లోనే అతి పెద్ద సినిమా ఈవెంట్‌గా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Leave a Reply