OG | పవర్ స్టార్ గిఫ్ట్..

OG | పవర్ స్టార్ గిఫ్ట్..
OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన భారీ చిత్రం ఓజీ. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. పవర్ స్టార్ వీరాభిమాని అయిన సుజిత్(Sujith).. పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో.. అలా చూపించడంతో ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఇందులో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేయడంతో ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్(The sequel) కు సంబంధించిన న్యూస్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తనకు అదిరిపోయే బ్లాక్ బస్టర్(Blockbuster) అందించి.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా అందచేశారు. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. చిన్నప్పటి నుంచి పవన్ అభిమానిని అయిన తను.. ఇప్పుడు ఆయన నుంచి గిఫ్ట్ అందుకున్నాను.. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా ఓజీ పవన్ కళ్యాణ్ ప్రేమ, ప్రొత్సాహం మరువలేనిది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను అని తెలియచేశారు. పవన్ గిఫ్ట్ ఇస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో(On social media) వైరల్ అయ్యాయి.
