Officers | ఎన్నికైన సర్పంచులచే ప్రమాణ స్వీకారోత్సవం

Officers | ఎన్నికైన సర్పంచులచే ప్రమాణ స్వీకారోత్సవం

Officers | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : గుడిహత్నూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో నూతనంగా 26 గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారులు(Officers) వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు తమను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల(Authorities) సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపడతామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply