Office | మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం…

Office | మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం…
Office | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లో బుధవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్వయంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ మోత్కూర్ మున్సిపాలిటీ లో పార్టీ కార్యకర్తలు పార్టీ టిక్కెట్ ఎవ్వరికీ ఇచ్చిన ఐక్యతతో ఒక్క తాటి పైకి వచ్చి 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, మున్సిపల్ కార్యాలయం పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
పోటీ సహజమని.. అధికార కాంగ్రెస్ లో ఆశావహులు అధికంగా ఉన్నారని,సర్వే ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తామని ,టిక్కెట్ ఆశించి … రాని వాళ్ళు అధ్యరై పడవద్దని,పార్టీ కోసం కష్టపడిన వారికి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. మోత్కూర్ ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వీలైతే సీపీఎం,సీపీఐ ,బీజేపీ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కు దోహదపడుతాయని… పార్టీ కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు,జిల్లా నాయకులు డా లక్ష్మి నర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు,ఏపీఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి,మాజీ జడ్పీటీసీ గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచ్ డా కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, నాయకులు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎం డి సమీర్, గణగాని నర్సింహా, బొడ్డుపల్లి కళ్యాణ్ , అన్నెపు పద్మ, జయశ్రీ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.
