Odisha | భార్య, కోడలు, మనవరాలి హత్య

Odisha | భార్య, కోడలు, మనవరాలి హత్య
Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని దియోగర్ జిల్లాలో రమేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన అతడు సుత్తితో దాడి చేసి తన భార్య, కోడలు, చిన్నారి మనవరాలిని హత్య చేశాడు.
ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఆ టైంలో అతని కుమారుడు ఇంట్లో లేడు. తర్వాత ఇంటికి వచ్చి ముగ్గురు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన ఒడిశా పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబ కలహాల వల్లే, మద్యం మత్తులో రమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
