వ్యవసాయ పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

వ్యవసాయ పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

వరి పొలాల పరిశీలన
మండల వ్యవసాయ అధికారి కళ్యాణి

టేకుమట్ల,ఆంధ్రప్రభః భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్క పల్లి గ్రామంలోని గ్రామం వరి పంటలను మండల వ్యవసాయ అధికారి కళ్యాణి పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో వరి పొలాల్లో అగ్గితెగులు, కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించడం జరిగిందని ఆమె తెలిపారు. దీనివల్ల వరి పొలంలో తెల్ల కంకలు ఎక్కువగా వచ్చి రైతులను నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాగా అగ్గి తెగు 0.6 గ్రాములు లేదా కాసుగా మైసిన్ 2.5మీ.లే లేదా ఐసో పోతాయోలేన్1.5మీ. లీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని అన్నారు.


కాండం తొలిచే పురుగు నివారణకు కార్ట్ ఆఫ్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరం ట్రానిలిప్రూల్ 60మీ . లీ మందును ఎకరంకుకలిపి స్ప్రే చేయాలన్నారు. తద్వారా నివరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బక్క పల్లి గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేందర్ వ్యవసాయ విస్తరణ అధికారులు రాహుల్ కళ్యాణి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply