observation | జనవరి ఫస్ట్ కి..టిడ్కో ఇళ్ళు
- తొలి విడతగా వెయ్యి ఇళ్ళు అప్పగింత
- ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…
observation | విజయవాడ ( పాయకాపురం), ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు(Umamaheswara Rao) శనివారం అధికారులతో కలసి పరిశీలించారు. గతంలో టిడ్కో ఇళ్లకు దఫాలుగా డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పించి నూతన సంవత్సరంలో గృహ ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. గతంలో 2014–2019 మధ్యకాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) నాయకత్వంలో, తాను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో, పేదవాడికి సొంత ఇల్లు కలను నిజం చేయాలి అనే లక్ష్యంతో టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా(Prestigiously) చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందని తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవారికి ఒక ఇల్లు అందించాలనే లక్ష్యంతో అపార్ట్‌మెంట్ స్టైల్(Apartment style)లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300, 365 స్క్వేర్ ఫీట్, 430 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, అతి తక్కువ ధరలో పేదలకు అందించే విధంగా రూపకల్పన(design) చేయబడిందని అన్నారు. ఈ పర్యవేక్షణలో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, జక్కంపూడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. కరీముల్లా, జక్కంపూడి అసిస్టెంట్ ఇంజనీర్ ఎ. సురేష్ బాబు, ఎన్‌సీసీ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్. శ్రీరామ్, వెల్కో (జె.వి) ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్,టీడీపీ నాయకులు ఆకుల సూర్యప్రకాష్,బంగారు నాయుడు,బుదాల సురేష్,కంచేటి నాగరాజు పాల్గొన్నారు.

