- చెక్ బుక్కులు, ప్రాంసరీ నోటీసులు స్వాధీనం
- నలుగురిపై కేసు నమోదు
ఎల్లారెడ్డి, (ఆంధ్రప్రభ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో (బుధవారం) విశ్వనీయ సమాచారం మేరకు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో గుట్టు చప్పుడు కాకుండా చీటీలతో పాటు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న 8 మంది వ్యాపారస్తుల ఇళ్లపై పోలీసులు నాలుగు బృందాలుగా మూకుమ్మడిగా సోదాలు నిర్వహించారు.
వడ్డీ, చీటీలు నిర్వహిస్తున్న వ్యాపారుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, ఏంటి చెక్ లు తోపాటు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ బోజ్జ మహేష్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ… ఎల్లారెడ్డి పట్టణంలో 8 మంది వ్యాపారస్తులపై దాడులు నిర్వహించగా నలుగురి వద్ద విలువైన పత్రాలు లభించడంతో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు బృందాలు పాల్గొన్నారు.