అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సూచించిన మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంగన్‌వాడీ టీచర్ మనోహర తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలకు ప్రతిరోజు అందించే పౌష్టికాహారం, ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply