Nutrition | ఘనంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం

Nutrition | ఘనంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం

Nutrition | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా మండలంలోని ముత్తునూరు గ్రామంలో లిటిల్ స్టార్(Little Star) ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులు చేపట్టిన పౌష్టికాహార(Nutrition) అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు. విద్యార్థులు చేప‌ట్టిన‌ దుకాణాలు ప్రజలను, పోషకులను ఆకట్టుకున్నాయి.

ఇవాళ‌ స్థానిక ప్రిన్సిపాల్ మహ్మద్ ఇర్ఫాన్అలీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ రిత్తే విట్టల్, ఉప సర్పంచ్ బోస్లే రాహుల్ పౌష్టిక ఆహార‌ దుకాణాలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు అమ్మకాలు, కొనుగోలుతో పాటు డబ్బు సంపాదనపై అవగాహన కలుగుతుందన్నారు. పోషకులు(Patrons) భారీ సంఖ్యలో పాల్గొని విద్యార్థుల వ‌ద్ద‌ కొనుగోలు చేసి ఉత్సాహపరిచారు. పాఠశాలలో మొదటిసారి ఈ కార్యక్రమం జరగడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply