వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం..

వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం వైయస్సార్ కాలనీ బ్లాక్ నెంబర్ 183లో నివసించే కొప్పుల గోపి తన బైక్ కాలి పోయింది అని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు‌. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి బ్లాక్ నెంబర్ 183 సెల్లార్ లో కొప్పుల గోపి బైక్ తో పాటు మరో రెండు లో బైకులు ఒకదాని తర్వాత మరోటి పార్క్ చేసి ఉన్నాయి.

కాలిన వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉందని తెలిసింది. వైయస్సార్ కాలనీ బ్లాక్ లో నివసించే వారు అందరు పడుకున్న సమయంలో రాత్రి 1 గం సమయం లో పొగ రావటం తో ఏం జరిగింది అని బ్లాక్ లో నివసించే వారు వచ్చి చూడగా బైక్ లు దగ్ధం అయి ఉన్నాయి. దాంతో టిఫిన్ బండి తో వ్యాపారం చేసే కొప్పుల గోపి తన బైక్ కాలి పోయింది అని ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందు పార్క్ చేసిన బైక్ లో స్పార్క్ రావడం వల్ల రెండో బైక్ సీటు అంటుకొని ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply