NTR Trust | మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం..

NTR Trust | మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం..

  • స్వచ్ఛంద రక్తదానం చేసిన తెలుగు యువత..
  • ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, టీడీపీ సహకారంతో…
  • భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు..

NTR Trust | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, శ్రీరాం చిన్నబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర నాయకుడు తుమ్మల చైతన్య స్వయంగా రక్తదానం చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించడం సమాజానికి అందించే అత్యంత గొప్ప సేవగా నిలుస్తుందని, ఈ కార్యక్రమం నిస్స్వార్థ సేవకు మార్గదర్శకంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజకీయాల్లో మరింత విజయాన్ని, ప్రజాసేవలో ఉన్నతమైన అవకాశాలను అందుకోవాలని తుమ్మల చైతన్య ఆకాంక్షించారు.

Leave a Reply