ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. అన్ని ప్రాంతాలలో కారు మబ్బులు దట్టంగా కమ్ముకోవడంతోపాటు భారీ ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. మరోవైపు భారీ శబ్దాలతో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు కూడా పలుచోట్ల పడ్డాయి. 8 గంటల ప్రాంతం నుండి భారీ వర్షం ఏకధాటిగా కురుస్తూ వచ్చింది. ఈదురు గాలులకు పలు ప్రాంతాలలో చెట్లు కొమ్ములు విరిగిపడడంతో పాటు, విద్యుత్ సరఫరా కు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. మరి కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది.

ఈదురు గాలులు భారీ వర్షం కారణంగా ఆదివారం నీటి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నగరంలోని పలు ప్రాంతాలలో గాలుల దాటికి ట్రాఫిక్ కూడా పంపించడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా మారింది. అలాగే పరీక్షా కేంద్రాల్లో ఈదురు గాలులకు కిటికీ అద్దాలు పగిలి, కేంద్రాలలో చిమ్మ చీకట్లో సైతం అలుముకున్నాయి.
అయితే గత కొంతకాలంగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది……
మరోసారి రైతుపై ప్రకృతి ప్రకోపం….
గత నెలలో రెండుసార్లు భారీ ఈదురు గాలుల దాటికి మామిడి, అరటి మొక్కజొన్న వంటి పంటలకు తీవ్రం నష్టం వాటిల్లో నేపథ్యంలో మరోసారి ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసినట్లయింది. ఇప్పటికే మామిడి పంటకు సరైన పూత లేక, తెగుళ్లతో సతమతమైన మామిడి రైతుకు మూడోసారి ఈ భారీ ఈదురు గాలుల కారణంగా పేను నష్టం వాటిల్లింది.
అలాగే అరటి, మొక్కజొన్నతో పాటు కోత కోసి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షాలకు పలు ప్రాంతాలలో ధాన్యం కూడా తడిసి ముద్దయింది. వీటితోపాటు పలు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఈదురు గాలులు అకాల వర్షం మరింత కష్టాన్ని తెచ్చి పెట్టింది.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత…
ఆదివారం ఉదయం భారీగా వివరిస్తున్న ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంద్రకీలాద్రి పైకి వెళ్లే ఘాట్ రోడ్డు ను అధికారులు మూసివేశారు. భారీ వర్షాలు పడుతుండడంతో కొండ చరియలు విసిగి పడే అవకాశం ఉండొచ్చు అన్న ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డు పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇంద్రకీలాద్రి కి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మీదుగా మహా మండపం నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకోవాలని దేవాది శాఖ కమిషనర్ ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ తెలిపారు.