సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..

లబ్ధిదారులకు నేరుగా అందజేసినఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
కొండపర్వలో ఇంటింటికీ వెళ్లి చెక్కుల అందజేత
అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా సహాయం

విస్సన్నపేట, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు లబ్ధిదారులకు వారి నివాసాల వద్ద స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ హఫీజా బేగంకు రూ.87,500, చిగురుబొత్తుల బిక్షమయ్యకు రూ.43,836, కోలేటి జోష్‌కు రూ.60,000 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆప్యాయంగా పరామర్శించారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న తమకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింహాద్రి నాని, గరిమెళ్ల లోకేశ్వరావు, పైడిపాల ఏసు, మరీదు నాని, దాసరి ఆంజనేయులు, దొనెల్లి రామారావు తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply