Ntr – Bunny | ఈ ఇద్దరి కంటే ముందు…

Ntr – Bunny | ఈ ఇద్దరి కంటే ముందు…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబోలో కార్తికేయ కథతో.. మైథలాజికల్ మూవీ చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే.. అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వెళ్లిందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి కానీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇంత వరకు అఫీషియల్ గా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఏమైంది..?
Ntr – Bunny | తెర పై రాని కథతో..

కార్తికేయ కథ ఇంత వరకు పూర్తి స్థాయిలో తెర పైకి రాలేదు. ఈ కథను తెరకెక్కించాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. ఈ కథ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెప్పడం.. కథ విని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమానే చేయాలి కానీ.. ట్విస్ట్ ఇచ్చాడు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాని అనౌన్స్ చేశాడు బన్నీ. అంతే.. బాగా ఫీలైన త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్ కు చెప్పడం.. ఆయన కథ విని ఓకే చెప్పడంతో.. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్టుగా న్యూస్ లీకైంది. ఎన్టీఆర్ కార్తికేయని గురించి మరింత తెలుసుకునేందుకు బుక్ చదవడం కూడా స్టార్ట్ చేశాడు.

Ntr – Bunny | మేలో అనౌన్స్ మెంట్ ఇదే..
ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో మైథాలిజికల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. మళ్లీ ఈ కథ బన్నీ దగ్గరకి వెళ్లిందని ఇండస్ట్రీలో వినిపించింది. త్వరలో బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమాని అనౌన్స్ చేస్తారనుకుంటే.. బన్నీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో సినిమాని అనౌన్స్ చేశారు.

దీంతో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ఇటీవల నిర్మాత నాగవంశీ.. మేలో భారీ అనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పడంతో.. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కాబట్టి.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీని ఆరోజు అనౌన్స్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Ntr – Bunny | ట్విస్ట్ ఇచ్చిన శివ కార్తికేయన్..
ఇదిలా ఉంటే.. శివ కార్తికేయన్, కమల్ హాసన్ కాంబోలో మూవీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే.. కార్తికేయ స్వామి లింక్ ఉండే సబ్జెక్టులానే కనిపిస్తుంది. దీంతో కార్తికేయ స్వామి కథతో మరో సినిమా రాబోతుందా అనేది ఆసక్తిగా మారింది. ఆ మధ్య దర్శకుడు కిషోర్ తిరుమల కూడా తన దగ్గర కార్తికేయ స్వామి నేపథ్యంలోనే ఓ పవర్ ఫుల్ స్టోరీ ఉందని చెప్పారు. ఆయన ఇప్పుడు రామ్ తో సినిమా చేయబోతున్నారు.
కార్తికేయ కథతోనే రామ్, కిషోర్ తిరుమల సినిమా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో కార్తికేయ కథతో వరుసగా సినిమాలు రాబోతున్నాయా.. అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇదే కనక నిజమైతే.. ఏ సినిమా ముందుగా రాబోతుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
click here to read more : Chiru Chaithu Nikhil | ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు..
