పార్టీ ఫిరాయింపులపై…

వెబ్ డెస్క్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మళ్లీ హాట్‌టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam PrasadKumar) కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన విచారణకు ట్రయల్‌ను ప్రారంభించి కీలక చర్యలు చేపట్టారు.

బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు — సంజయ్, పోచారం శ్రీనివాస రెడ్డి, తెల్లం వెంకట్ రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి —కు స్పీకర్ నోటీసులు (Notices) జారీ చేశారు. అదే విధంగా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్‌ నాయకులకు కూడా నోటీసులు అందాయి.

ఎమ్మెల్యేలు పార్టీ మారారని నిర్ధారించేందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని స్పీకర్ (Speaker) ప్రసాద్ కుమార్ ఆదేశించారు. ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply