Notices | మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు

Notices | మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు

  • కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు జోలికొస్తే రాష్ట్రం అగ్నిగుండమే.
  • తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపిత కేసీఆర్.
  • రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా.?
  • కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది.
  • బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంత రాజు గౌడ్

Notices | మర్రిగూడ ఫిబ్రవరి 01 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు లకు సిట్ నోటీసులు అందజేసి డ్రామాలు ఆడుతుందని మర్రిగూడ మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంత రాజు గౌడ్ విమర్శించారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కెసిఆర్ కు విచారణ పేరుతో సిట్ నోటీస్ అందజేయడాని నిరసిస్తూ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి మాజీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్ లతో కలిసి రాజు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండo అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

సిట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది కక్ష సాధింపు రాజకీయమని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, ఆయనను టచ్ చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణకు ఒక భావోద్వేగమని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. దేశంలోనే ఏ రాష్ట్రములో అమలుపరచని కనివిని ఎరుగని ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచిన మహా నాయకుడని కొనియాడారు.

10సంవత్సరాలు అద్భుతమైన ప్రజాపాలన చేసినటువంటి తెలంగాణ మహాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడ్డుపెట్టుకొని కక్షపూరితమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడoతో అతడు చేసిన తప్పుకు అప్పటి కెసిఆర్ ప్రభుత్వం అయనపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతనిని జైలుకు పంపిస్తే నేడు అట్టి విషయాలను దృష్టిలో ఉంచుకొని దానికి ప్రతికారoగా చేయని తప్పులకు తెలంగాణ తెచ్చిన మహాత్మునికి నోటీసులను అందజేయడo హేయమైన చర్య అన్నారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తేనే నేడు రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాన్నారు.

కక్ష సాధింపు రాజకీయాలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని ఇప్పకైనా ఇలాంటి రాజకీయాలను మానేసి అభివృద్ధి పై ఆలోచన చేయాలి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు వల్లంల సంతోష్ యాదవ్, సీతారాం నాయక్, కమ్మచించు వెంకటేష్, రొక్కం భాస్కర్ రెడ్డి, మండల నాయకులు, అంతిరెడ్డి, మాధవరెడ్డి, నగేష్, రామన్న, శ్రీరాములు, బీరప్ప, శ్రీ రామ్, నాగరాజు, శ్రీను, గిరి, లింగస్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply