Notice | రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…?

Notice | రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…?
Notice | రుద్రూర్, ఆంధ్రప్రభ : కేసీఆర్ కు నోటీసులా…? తెలంగాణ సమాజం క్షమించదు రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైన కేసీఆర్ కు సిట్ నోటీసులతో వేధించాలని చూస్తే తెలంగాణ సమాజం క్షమించదు అని రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గాండ్లు మధు అన్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్రప్రభుత్వం సాధిస్తున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ రుద్రూర్ మండలంలో బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్) ఇచ్చిన పిలుపులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మధు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన, అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. రస్తారోకో చేయడంతో ఎక్కడికి అక్కడ బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స్థానిక ఎస్సై సాయన్న అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న పార్టీ శ్రేణులను అక్కడి నుంచి లేపేశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం తక్షపూరిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్ పై కుట్రలు చేయడం మానుకోవాలి.

ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలను వేధించడమే ధ్యేయంగా పెట్టుకుంటే ప్రజలే రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్ పై జరుగుతున్న ప్రతి దాడిని బి ఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా చెప్పి కొడతారని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన, రాస్తారోకో, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మధు, రవి కిరణ్, దౌడ్ సాయిలు, శేఖర్, చాకలి బీమ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
