అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ విద్యను అందించడమే లక్ష్యం..

అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ విద్యను అందించడమే లక్ష్యం..
పాఠశాల డైరెక్టర్ రామోజీరావు
ముగిసిన కాకతీయ ఒలంపియాడ్ రోబో ఫెస్ట్
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్స్ ప్రదర్శనలు ఘనంగా ముగిశాయి. పాఠశాల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అతి పెద్ద రోబో ఫెస్ట్ నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఇందుకోసం కృషి చేసిన రోబోటిక్స్ స్టాఫ్, టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బంది అందరినీ అభినందించారు.
నగరంలోని శ్రీరామా గార్డెన్స్‌లో గత రెండు రోజులుగా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక ఆదివారంతో ముగిసింది. రెండవ రోజు సెలవుదినం కావడంతో తల్లిదండ్రులు, విజిటర్స్ తాకిడి శనివారం కంటే ఎక్కువగా కనిపించింది. ప్రదర్శనలను వీక్షించిన ప్రజలు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. రెండవ రోజు విద్యార్థులు మరింత ఉత్సాహంతో పాల్గొని తమ రోబోటిక్స్ ప్రాజెక్టులను విజిటర్స్‌కు వివరించారు.

ఈ సందర్భంగా ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు, వ్యక్తిగత మెడల్స్ అందజేసింది. భవిష్యత్తులో నిజామాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ విద్యను అందించడమే లక్ష్యంగా ఇలాంటి రోబో ఫెస్ట్‌లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. డైరెక్టర్ రజినీకాంత్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే రోబోటిక్స్ కాన్సెప్ట్‌పై అవగాహన పెంపు అవసరమని, నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య ఎంతో కీలకమని తెలిపారు.

భవిష్యత్తు అంతా టెక్నాలజీ ఆధారంగానే నడుస్తుందని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఇలాంటి ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. ఐఐటి ఫౌండేషన్ & ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ రోబో ఫెస్ట్‌ను నిర్వహించామని, నిజామాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ విద్యను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రజినీకాంత్, రాజా, రామోజీరావు, తేజస్విని, ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, రవికాంత్, సుచరిత, వైస్ ప్రిన్సిపాళ్లు భావనా, భూపాల్, రోబోటిక్స్ హెడ్ నిరేష్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

