Nominations | బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే..

Nominations | బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే..

  • ముగిసిన నామినేషన్ల పరిశీలన!
  • ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు.. స్వతంత్రుల గుబులు

Nominations | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బెల్లంపల్లి పట్టణంలో రాజకీయ కోలాహలం పతాక స్థాయికి చేరింది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగియడంతో 34 వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డులో ప్రధాన పార్టీల నుంచి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు రావడంతో, బీ-ఫారమ్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో మొత్తం 252 మంది అభ్యర్థులు నిలవగా, అధికారికంగా 279 నామినేషన్ల సెట్లు ఆమోదం పొందాయి. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుండి 123, బీఆర్ఎస్ నుండి 81, బీజేపీ నుండి 27 సెట్లు బరిలో ఉన్నాయి.

వార్డుల వారీగా అభ్యర్థుల పూర్తి జాబితా:

1వ వార్డు : కొయ్యడ ప్రసన్న (బీఆర్ఎస్), అడ్డూరి స్వప్న (కాంగ్రెస్), పొట్ల లలిత (కాంగ్రెస్), లక్ష్మి మాదారి (కాంగ్రెస్), సుమలత జంగిలి (బీఆర్ఎస్).
2వ వార్డు : అరుణ్ కుమార్ సబ్బని (బీఆర్ఎస్), వంశీ కృష్ణ నిచకోల (కాంగ్రెస్), పట్టి వెంకట కృష్ణ (బీజేపీ), గోమాస ప్రవీణ్ కుమార్ (కాంగ్రెస్).
3వ వార్డు : పొరండ్ల సత్యవతి (కాంగ్రెస్), సౌజన్య లక్కాకుల (బీఆర్ఎస్), హమద్ బి మొహమ్మద్ (స్వతంత్ర), రేణుక పట్టపాక (కాంగ్రెస్), చుంచు వెంకటమ్మ (కాంగ్రెస్), హమద్ బీ మొహమ్మద్ (కాంగ్రెస్).
4వ వార్డు : ఇ. కమల (బీఆర్ఎస్), రాధ మాటూరి (బీఆర్ఎస్), ఎనగందుల మౌనిక (బీజేపీ), మద్దెల తిరుమల (బీజేపీ), పి. శాంత (బీఎస్పీ), కట్ట శారద (కాంగ్రెస్), రజిత అనుగుల అలియాస్ బోగం (బీఎస్పీ), దాసరి కవిత (కాంగ్రెస్), పి. శాంత (కాంగ్రెస్), మిట్టపల్లి రమాదేవి (బీఆర్ఎస్), మిట్టపల్లి రమాదేవి (స్వతంత్ర).
5వ వార్డు : మొగురం కన్నయ్య (స్వతంత్ర), మొగురం కన్నయ్య (కాంగ్రెస్), గోగర్ల స్వప్న (బీఆర్ఎస్), సముద్రాల సుధాకర్ (బీజేపీ), వీరస్వామి అందే (కాంగ్రెస్), శనిగారపు రాజేందర్ (సీపీఐ), పరమేష్ పేరాపల్లి (కాంగ్రెస్), కొమ్ము సూర్య (కాంగ్రెస్), సముద్రాల సుధాకర్ (స్వతంత్ర).
6వ వార్డు : వరలక్ష్మి దుబాసి (స్వతంత్ర), లక్ష్మి ఉప్పు (బీజేపీ), దుబాసి లక్ష్మీ (కాంగ్రెస్) సల్లా కృష్ణవేణి (బీఆర్ఎస్), డి. లింగమ్మ (బీఎస్పీ), అరకొండ రజిత (కాంగ్రెస్), కోట స్వరూప (స్వతంత్ర), నాతరి సునీత (సీపీఐ), చిన్నమ్మ గజ్జె (బీఎస్పీ), బాస్కరి శ్రీలత (బీఆర్ఎస్), దొబ్బల రజిత (డీబీపీ).
7వ వార్డు : గుజ్జ రవి (కాంగ్రెస్), స్వాతి దావ (కాంగ్రెస్), అరె వరలక్ష్మి (బీఆర్ఎస్), సాజిద్ పాషా అలీ సయ్యద్ (బీఆర్ఎస్), శంకర స్వామి భీమా (బీఆర్ఎస్), ముత్తమల్ల కావ్య జ్యోతి (కాంగ్రెస్), కిరణ్ దర్శనాల (బీఆర్ఎస్).
8వ వార్డు : అబ్దుల్ నయీమ్ మొహమ్మద్ (బీఆర్ఎస్), రాజమౌళి మీనుగు (కాంగ్రెస్), భవాని బియ్యాల (సీపీఐ), నిజాముద్దీన్ మొహమ్మద్ (కాంగ్రెస్), జిలకర వాసు (కాంగ్రెస్), గోలి శ్రీనివాస్ (బీజేపీ), ఉపేందర్ బియ్యాల (సీపీఐ), మీనుగు సరోజ (కాంగ్రెస్), కొండ శ్రీనివాస్ (బీఆర్ఎస్), రసూల్ బీ మొహమ్మద్ (కాంగ్రెస్).
9వ వార్డు : రొడ్డ శారద (కాంగ్రెస్), బాగ్ మోహన్ (కాంగ్రెస్/బీజేపీ), సిరికొండ సుస్మిత్ (కాంగ్రెస్), కంపెల్లి రాజం (బీఆర్ఎస్), కుంటల శ్రీనివాస్ (బీఎస్పీ).
10వ వార్డు : గాలి సుమలత (కాంగ్రెస్), మల్లమ్మ తుడి (బీఆర్ఎస్), బండి స్వప్న (స్వతంత్ర), గుర్రాల శారద (సీపీఐ), కొక్కెర కావ్య (కాంగ్రెస్), పద్మ డీకొండ (కాంగ్రెస్), సుక్క సరిత (బీజేపీ), సుక్క లక్ష్మి (కాంగ్రెస్), పుష్పలత తుడి (బీఆర్ఎస్).
11వ వార్డు : ముల్కల మంగ (కాంగ్రెస్/స్వతంత్ర), గుర్రాల శారద (సీపీఐ), గాలి సుమలత (కాంగ్రెస్), బత్తుల అనసూయ (బీఆర్ఎస్), పనగంటి సంధ్యారాణి (బీఆర్ఎస్), జక్కుల శ్వేత (కాంగ్రెస్), గుర్రం శ్రావణి (బీజేపీ).
12వ వార్డు : ఉండ్రాల మల్లయ్య (కాంగ్రెస్/స్వతంత్ర), జరుపుల లక్ష్మి (కాంగ్రెస్), రాము నాయక్ భుక్యా (కాంగ్రెస్), ఉండ్రాల సాలమ్మ (కాంగ్రెస్/స్వతంత్ర), తిరుమల వాసు ధరావత్ (బీఆర్ఎస్), బుక్యా రాజు బుక్యా (బీజేపీ).
13వ వార్డు : శ్రీనివాస్ చింతల (కాంగ్రెస్), బండి ప్రభాకర్ (కాంగ్రెస్), బండి ఉమాదేవి (కాంగ్రెస్) మత్తమారి ఉమా మహేశ్వర్ (బీఆర్ఎస్), ఆసం అఖిల్ (బీఆర్ఎస్), దొంగల రమాదేవి (బీఆర్ఎస్), దొంగల రాజ్ కుమార్ (బీఆర్ఎస్).
14వ వార్డు : అసాది మధుకర్ (బీఆర్ఎస్/స్వతంత్ర), మహేంద్ర కుమార్ బెడ్డల (బీఆర్ఎస్), బడే జ్యోతి (కాంగ్రెస్/స్వతంత్ర), ముక్కెర సోమశేఖర్ (కాంగ్రెస్), కల్లెపల్లి నవీన్ (బీజేపీ), గజ్జల రాంనాథ్ (టీజేఎస్పీ), టింకరి శివ కుమార్ (స్వతంత్ర), సంబోది శ్రీని (బీజేపీ), బడే రాజనర్సు (కాంగ్రెస్), ఉదురుకోట కరుణాకర్ (బీఆర్ఎస్), బోగ శ్రావణ్ కుమార్ (కాంగ్రెస్), కందే వేణుగోపాల్ (కాంగ్రెస్).
15వ వార్డు : చింతల వసంత (కాంగ్రెస్) , దేవసాని మాధవి (కాంగ్రెస్), రత్నం భూమేశ్వరి (సీపీఐ), కలాలి లక్ష్మి (బీఆర్ఎస్), ఆరేపల్లి సుధారాణి (కాంగ్రెస్), బొల్లి దేవమ్మ (కాంగ్రెస్), రామగిరి మాధవి (బీఆర్ఎస్), పైడిమల్ల సంధ్యారాణి (బీఆర్ఎస్), దేబ్బేటి సుజాత (కాంగ్రెస్), ఆరేపల్లి లావణ్య (కాంగ్రెస్), మద్దెల సరిత (ఏఐఎఫ్బీ).
16వ వార్డు : గంధం రాజేందర్ (కాంగ్రెస్), మత్తమారి రాయమల్లు (కాంగ్రెస్), రమాదేవి రేగుంట (కాంగ్రెస్), ఎలిగేటి శ్రీనివాస్ (కాంగ్రెస్/బీఆర్ఎస్), కత్తి శ్రీనివాస్ (బీఆర్ఎస్), బలరాం యదండ్ల (బీఆర్ఎస్), గోవర్ధన్ కోయిల్కర్ (బీజేపీ), షేక్ రియాజ్ బాబా (బీఆర్ఎస్), వంగల చక్రపాణి (కాంగ్రెస్).
17వ వార్డు : రాగం శెట్టి సత్యనారాయణ (కాంగ్రెస్/బీఎస్పీ), రాపెల్లి విజయ్ కుమార్ (బీఆర్ఎస్), కుడికాల శివ శంకర్ (కాంగ్రెస్), పినిరెడ్డి లక్ష్మణరావు (కాంగ్రెస్/బీఆర్ఎస్), కుడికాల రావళి (కాంగ్రెస్), తడిగొప్పుల శేఖర్ (స్వతంత్ర), పత్తిపాక రాజ్ కుమార్ (కాంగ్రెస్).
18వ వార్డు : బత్తుల అనిత (బీఆర్ఎస్), తస్లీమ్ సుల్తానా షేక్ (కాంగ్రెస్), రాచా స్వప్న (బీజేపీ), ఠాకూర్ మౌనిక సింగ్ (కాంగ్రెస్), గురుండ్ల లక్ష్మి (కాంగ్రెస్), ఇటిపాముల అశ్విని (బీజేపీ/కాంగ్రెస్/జేఎస్పీ), దోడ్ల రాజేశ్వరి (కాంగ్రెస్).
19వ వార్డు : సిరికొండ స్నేహ (ఏఐఎంఐఎం), సిమ్రాన్ షేక్ (బీఆర్ఎస్), మినగు సౌజన్య (కాంగ్రెస్/స్వతంత్ర), జయ కొమ్ముల (కాంగ్రెస్), పద్మ బండి (కాంగ్రెస్), గాయత్రీ దేవి ఠాకూర్ (కాంగ్రెస్), దమయంతి కాంపెల్లి (కాంగ్రెస్), కొరల్ల రేచల్ (బీఎస్పీ), సుజాత మద్దెల (కాంగ్రెస్), నస్రీన్ మొహమ్మద్ (బీఆర్ఎస్).
20వ వార్డు : రాజలక్ష్మి సుంకర్ (బీజేపీ), సయ్యద్ అస్లాం (బీఆర్ఎస్), తాండ్ర స్రవంతి (బీఆర్ఎస్), జుట్టు నర్సయ్య (బీఎస్పీ), మత్తమారి శ్రీనివాస్ (కాంగ్రెస్), దార రాజేశం (బీజేపీ), సరస్వతి మత్తమారి (కాంగ్రెస్), వినేష్ సోది (కాంగ్రెస్), రమేష్ గోసిక (బీఆర్ఎస్/కాంగ్రెస్), బాల్మీకి సునీల్ (కాంగ్రెస్), పోశమ్మ జుట్టు (బీఎస్పీ).
21వ వార్డు : రాజనాల రమేష్ (బీఆర్ఎస్), షేక్ సబీరా (స్వతంత్ర), ఎలుక ఆకాష్ (కాంగ్రెస్), ఎలుక సునీత (కాంగ్రెస్), గుండారపు మెర్సీ విక్టోరియా (కాంగ్రెస్), రాజనాల కమల (బీఆర్ఎస్), దుడపాక బలరాం (కాంగ్రెస్), నంది హారిక (స్వతంత్ర). 22వ వార్డు: ఎల్లాబాయి పికా (కాంగ్రెస్), రోజ్ పింకీ గోసిక (బీఆర్ఎస్), ఆకుల లలిత (కాంగ్రెస్), శివరంజని బొగే (బీఆర్ఎస్), అడ్డూరి ప్రవళిక (బీఆర్ఎస్).
23వ వార్డు : కల్పన జంగం (కాంగ్రెస్), శృతి మడుగుల (బీఆర్ఎస్), శనిగరపు సరిత (బీజేపీ), భూపల్లి హిందుమతి (కాంగ్రెస్), అరుణ సుందరి నిట్ట (బీఆర్ఎస్/బీజేపీ), జయశీల సెరిపెల్లి (కాంగ్రెస్/బీఆర్ఎస్), పటాకుల సౌజన్య (సీపీఐ).
24వ వార్డు : దామెర విజయలత (కాంగ్రెస్/ఏఐఎఫ్బీ), వరలక్ష్మి కొత్తూరి (బీఆర్ఎస్), గాజుల లక్ష్మి (కాంగ్రెస్), రామగిరి ఐలవ్వ (కాంగ్రెస్).
25వ వార్డు : పద్మలత వొల్లాల (బీఎస్పీ), స్వరూప దుగుట (బీఆర్ఎస్), దాసరి మల్లు (బీఆర్ఎస్), సనా (ఏఐఎంఐఎం), తుంగపల్లి భాగ్య (బీఆర్ఎస్), ప్రణీత కంకటి (కాంగ్రెస్).
26వ వార్డు : బడికాల స్వరూప (కాంగ్రెస్), సరిత రేణికంట్ల (బీఆర్ఎస్), ఇప్ప కుమారస్వామి (కాంగ్రెస్), కాశీపేట స్వర్ణలత (కాంగ్రెస్/సీపీఐ), ఇప్ప స్వామి (బీజేపీ), భూపల్లి రాజేశ్వరరావు (కాంగ్రెస్), సహాయ్ కాటం (కాంగ్రెస్), శంకర్ రేణికంట్ల (బీఆర్ఎస్).
27వ వార్డు : దుగుట రవి (కాంగ్రెస్/బీఆర్ఎస్), రాజేందర్ బైరం (బీఆర్ఎస్), శ్రావణ్ కుమార్ బెతి (కాంగ్రెస్), దాసరి ప్రతాప్ (కాంగ్రెస్), సుమలత బైరం (బీఆర్ఎస్), రమేష్ గంగారపు (బీజేపీ).
28వ వార్డు : వెంకటేశం పసులేటి (ఎంసీపీటీయూ), మనోహర్ చిప్ప (కాంగ్రెస్), అర్చన చిప్ప (కాంగ్రెస్), గాండ్ల మహేష్ (బీజేపీ/బీఆర్ఎస్), గద్దల ధర్మేందర్ (బీఆర్ఎస్), అబ్దుల్ రఫీ (కాంగ్రెస్), శ్రీనివాస్ రామగిరి (కాంగ్రెస్), మునిశెట్టి గోవర్ధన్ (బీఆర్ఎస్), రాజ్ కుమార్ కొత్తపల్లి (కాంగ్రెస్).
29వ వార్డు : పున్నం చంద్రు మేడి (కాంగ్రెస్), హరికిషన్ పాండే (కాంగ్రెస్), రాజులాల్ యాదవ్ (బీజేపీ/బీఆర్ఎస్/స్వతంత్ర), కోడి రమేష్ (బీజేపీ), శ్రీరామోజు శ్రీనివాస్ (బీజేపీ), పెండం కనకయ్య (బీఆర్ఎస్), వెంకటస్వామి సజ్జనపు (కాంగ్రెస్), చంద్రయ్య మురుకూరి (బీఆర్ఎస్), శ్రావణ్ కుమార్ మురుకురి (బీఆర్ఎస్).
30వ వార్డు : షమీమ్ (బీఆర్ఎస్), గెల్లి విజయ లక్ష్మి (కాంగ్రెస్), సుకేషిని భరద్వాజ్ (కాంగ్రెస్), స్రవంతి ఎర్రోజు (బీజేపీ), మొహమ్మద్ జవేరియా (బీఆర్ఎస్).
31వ వార్డు : గెల్లి వరలక్ష్మి (కాంగ్రెస్), కేశవేని లలిత (కాంగ్రెస్), గెల్లి సంధ్య (కాంగ్రెస్), బండారి స్రవంతి (బీఆర్ఎస్), బండారి రాజమ్మ (బీఆర్ఎస్), లెంకల శ్వేత (కాంగ్రెస్).
32వ వార్డు : నీలి హారిక (కాంగ్రెస్), దేవ రజిత (బీఆర్ఎస్), మొహమ్మద్ షెహనాజ్ బాను (స్వతంత్ర), దేవ సంజన (బీఆర్ఎస్).
33వ వార్డు : సునీత తోట (కాంగ్రెస్), మేకల పద్మ (కాంగ్రెస్), స్రవంతి ముత్తే (బీఆర్ఎస్), రజిత బండి (కాంగ్రెస్), ఉమాదేవి పోలు (బీఆర్ఎస్), కళ్యాణి నామసాని (బీఆర్ఎస్).
34వ వార్డు : కొక్కుల రామ్ మూర్తి (బీజేపీ), శ్రీపల్లి చంద్రశేఖర్ (బీఆర్ఎస్), గోలి భాగ్యలక్ష్మి (బీఆర్ఎస్), గోలి సదానందం (బీఆర్ఎస్), చిట్యాల మధు (కాంగ్రెస్), కనుకుంట్ల రాజేష్ (కాంగ్రెస్), శ్రీనాథ్ బైరి (స్వతంత్ర), గొడుగు రఘు (కాంగ్రెస్), గడ్డం కవిత (కాంగ్రెస్), కేశబోయిన అఖిల్ (కాంగ్రెస్).

బీ-ఫామ్ యుద్ధం: రేపటితో ముగియనున్న ఉత్కంఠ!
నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తున్న తరుణంలో, ఆశావహుల బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. ఒకే పార్టీ నుంచి పలువురు నామినేషన్లు వేయడంతో, అధికారిక అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా విడుదలైన తర్వాతే అసలైన ప్రచార పర్వం ఊపందుకోనుంది. పట్టణ అభివృద్ధిని అజెండాగా మార్చుకున్న పార్టీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

మహిళా ఓటరే మకుటం!
బెల్లంపల్లిలోని 44,575 మంది ఓటర్లలో, ఏకంగా 23,012 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. పురుషుల కంటే మహిళల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. బీ-ఫామ్ కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ పైరవీలు చేస్తున్న అభ్యర్థులు, ఈ క్షేత్రస్థాయి సమస్యలకు ఏమని సమాధానం చెబుతారో వేచి చూడాలి. ఓటరు దేవుడు ఎవరికి పట్టం కడతారో ఫిబ్రవరి 13న తేలనుంది.

Leave a Reply