Nomination | నిజాంపేటలో సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ ప్రచారం
Nomination | నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో నామినేషన్ వేసిన వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు. తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిజాంపేట గ్రామ అభివృద్ధి జరగాలంటే తనకు ఓటు వేయాలన్నారు. భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామంలో కావలసినటువంటి వసతులను సమకూరుస్తామన్నారు. గ్రామ ప్రజలు ఈ సారి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. 14న జరిగే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

