Noise | రెండో రోజు కొనసాగుతున్న ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర

Noise | రెండో రోజు కొనసాగుతున్న ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర
అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : కళ్యాణదుర్గం నియోజక వర్గం ఐదుకల్లు గ్రామంలో రచ్చబండ…
వైయస్ షర్మిల రెడ్డి
⁃ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరా
⁃ ఎన్నో కుటుంబాలకు మేలు చేసింది ఉపాధి పథకం
⁃ ఉపాధి హామీ నిలిపివేయాలని కేంద్రం కుట్రలు చేస్తుంది
⁃ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఖూనీ చేస్తుంది
⁃ కొత్త చట్టాలతో ఉపాధిని చంపేయాలని చూస్తున్నారు
⁃ మన్రేగా లో పనులు నిర్ణయించే అధికారం గ్రామసభలదే
⁃ గ్రామాలకు ఎం కావాలి అనేది గ్రామసభల నిర్ణయం
⁃ మోడీ తెచ్చిన గ్రామ్ జి చట్టంలో పనులు ఢిల్లీ నిర్ణయిస్తుందట
⁃ గ్రామాల నుంచి నిర్ణయాధికారం తొలగిస్తారట
⁃ మనకు ఏం కావాలో ఢిల్లీ వాళ్లకు ఏం తెలుసు ?
⁃ మన్రెగా పథకంలో 100 శాతం నిధులు కేంద్రం ఇవ్వాలి
⁃ కానీ గ్రామ్ జి పథకంలో 40 శాతం రాష్ట్రాలు ఇవ్వాలట
⁃ రాష్ట్రం 40 శాతం ఇవ్వకపోతే పథకం ఆగిపోయినట్లేనా?
⁃ గ్రామ్ జీ అక్రమ చట్టం .. ఈ చట్టం రద్దుకోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
⁃ పేదల పొట్ట కొట్టే గ్రామ్ జి చట్టాల మీద పోరాటం చేయాల్సి ఉంది
⁃ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది
⁃ ఆనాడు 2006 లో ముఖ్యమంత్రిగా ప్రారంభం అయిన పథకం ఉపాధి హామీ పథకం
⁃ పైలట్ ప్రాజెక్ట్ గా ఇదే అనంతపురం జిల్లాలో పథకం ప్రారంభం అయింది
⁃ మన్రేగా లో పని అడిగిన వెంటనే పని ఇవ్వాలి
⁃ ఆనాడు రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనాల కోసం 60 లక్షల బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేశారు
⁃ ఉపాధి హామీ అమలు దేశానికే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శం
⁃ ఇక్కడ వైయస్సార్ గొప్పగా అమలు చేశారు
⁃ పథకం రూపకల్పనలో వైయస్సార్ కీలకపాత్ర పోషించారు
⁃ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దిగజార్చింది
⁃ ఆనాడు శ్రామికులకు పనిలో మజ్జిగ కూడా పోసేవారు
⁃ ఇప్పుడు గుక్కెడు నీళ్లు కూడా లేవు
⁃ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఖర్చు అనుకుంటుంది
⁃ ఉపాధి హామీ పథకంతో భారం అనుకుంటారు
⁃ ఏడాదికి 86 వేల కోట్ల ఖర్చు ఉపాధికి అవుతుంది
⁃ ఇదంతా మిగల్చడానికి ఉపాధిని చంపుతున్నారు
⁃ అందుకే చట్టం మార్చేశారు
⁃ ముందు గాంధీ పేరు తొలగించారు
⁃ చట్టంలో పని హక్కును తొలగించారు
⁃ వాళ్ళు ఇస్తేనే పని .. లేకుంటే లేదు
⁃ గ్రామ్ జి పథకంలో ఎన్నో నిబంధనలు పెట్టారు
⁃ వాళ్ళు ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఇక పనులు
⁃ ఉపాధి హామీ పథకాన్ని లేబర్ సప్లై కోసం వాడాలని చూస్తున్నారు
⁃ కాంట్రాక్టర్ల చేతిలో గ్రామ్ జి పథకాన్ని పెట్టారు
⁃ ఇక కాంట్రాక్టర్లు ఇచ్చే లేబర్ పని శ్రామికులు చేయాలి
⁃ గ్రామ్ జి చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుభారం
⁃ రాష్ట్రంపై ఏడాదికి 5 వేల కోట్ల భారం
⁃ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
⁃ ఇలాంటి సమయంలో 5 వేల కోట్లు గ్రామ్ జి పథకానికి ఇవ్వడం కష్టం
⁃ రాష్ట్రాలకు భాగస్వామ్యం చేయడం ఒక కుట్ర
⁃ పథకాన్ని నిలిపివేయడానికి రాష్ట్రాలకు భాగం చేశారు
⁃ రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం కూడా 60 శాతం నిధులు ఇవ్వదు
⁃ అందరూ అనుకొని చేసిన కుట్ర ని ఇదే
⁃ ఉపాధి శ్రామికులపై కేంద్రం చేసే కుట్రలో చంద్రబాబు , పవన్ భాగం అయ్యారు
⁃ జగన్ కూడా ఉపాధి హామీ చట్టాన్ని సాగించాలని ఉద్యమం చేయడం లేదు
⁃ బాబు ఇక్కడ మద్దతు ఇచ్చి కేంద్రంలో నిధులు కావాలని అడగడం ఎందుకు ?
⁃ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలి
⁃ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజలు ఉద్యమం చేయాలి
⁃ గ్రామ్ జి చట్టం వద్దని చెప్పాలి
⁃ గ్రామ జి చట్టం గ్రామాలను నాశనం చేస్తుంది
⁃ మళ్లీ వలసలను మొదలు పెడుతుంది
⁃ కేంద్రం పై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది
⁃ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదు


