గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతాపై అవగాహన పెంచుకోవాలని, నోపార్కింగ్ నియమాలు పాటించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ఈ రోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రోడ్డు భద్రతాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ వరకు, అలాగే లక్ష్మీ నగర్ ప్రాంతంలో గల వాహనాలను రోడ్డుమీద నిలపవద్దని షాపుల యజమానులను పిలిచి వారికి ఏసీపీ సూచించారు.
రోడ్లపై వాహనాలను నిలపవద్దని, నో పార్కింగ్ నియమాలను పాటించాలని పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలు నిలవడం వల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని అన్నారు. ఏసీపీ శ్రీనివాస్ ప్రతి షాపు వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడుతూ, రోడ్డు పక్కన వాహనాలు నిలిపినచో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. షాపు యజమానులు తమ దుకాణం ముందు,” నో పార్కింగ్” బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ శ్రీనివాస్, సీఐ రాజేశ్వరరావు, ఎస్సై హరి శేఖర్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.