గుడులపై  ప్రేమ లేదు

ఆదాయంపైనే గురి

సర్కారుపై బ్రహ్మర్షి ఆర్​ ఎం దాస్​ ఫైర్​ 

( నర్సాపురం ఆంధ్ర ప్రభ)

హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని  ఆధ్యాత్మిక ప్రచార కర్త , భగవద్గీత ప్రచారకులు,  అభయ హిందు సేన వ్యవస్థాపకులు బ్రహ్మర్షి రాధా మనోహర్ దాస్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోని పెళ్ళిళ్ళ గుడిలో ఆయన సనాతన ధర్మ ప్రచార  కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ ప్రవచనం లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు గుడిపై వచ్చే ఆదాయం తప్ప..  దేవాలయాలపై లేదన్నారు.  ప్రభుత్వానికి  దేవాలయాలపై ప్రేమ లేదని, వాటిపై వచ్చే ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి కావాలని, ఆలయాలను పట్టించుకునే ప్రభుత్వాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవాలయాలు ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయన్నారు. ప్రభుత్వాలు దేవాలయాలను పట్టించుకుంటుందనే భ్రమలో ఉండకండి…. మన దేవాలయాలను మనమే పరిరక్షించి కోవాలని పిలుపు ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు వల్ల దేవాలయాలకు ఎటువంటి ప్రయోజనం లేదని, పూర్వం రాజులు దేవాలయాలకు వజ్ర వైడూర్యలు, బంగారు ఆభరణాలు, మాన్యాలు ఇచ్చేవారని,  వాటిని వాడుకునేందుకు ప్రభుత్వాలు దేవాలయాలపై ప్రేమ కురిపిస్తాయని విమర్శించారు.

 ప్రభుత్వాలకు ఆదాయాలున్న దేవాలయాలు తప్ప… చారిత్రాత్మిక గుడులు వంక కన్నెత్తి కూడా చూడటం లేదని ఎద్దేవ చేశారు.  డబ్బులు ఉన్నంత వరకే దేవాలయాలపై ప్రేమ కురిపిస్తాయని  విమర్శించారు. ఆదాయం లేని మసీదులు, చర్చలను ప్రభుత్వం టచ్ చేయదని,  ఆదాయం వచ్చే హిందు దేవాలయంపై మాత్రమే ప్రభుత్వం ప్రేమ కురిపిస్తుందని తెలిపారు. దేవాలయాలలోని  డబ్బులను వాడుకునేందుకు మాత్రమే నిర్వహణ బాధ్య తలను  ప్రభుత్వం చేపడుతుందన్నారు.   ఆలయాల విశిష్టత ను తెలియ జేస్తూ  దేవాలయాలలో భక్తులు సంఖ్య పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతీ హిందువు దేవాలయాలను సందర్శించాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.  హిందూ దేవాలయాల విశిష్టత గురించి సోషల్ మీడియా ద్వారా భక్తులకు తెలుస్తుందని,  ప్రభుత్వం కూడా హిందూ దేవాలయాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో   పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు  చేపట్టి,  దేవాలయాలకు వచ్చే భక్తులు సంఖ్య పెరిగే విధంగా చర్యలు చేపడితే గుడి ఆదాయం కూడా పెరుగు తుందన్నారు.

ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు..

పెళ్ళిళ్ళ గుడిలో కార్తీక మాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మర్షి రాధా మనోహర్ దాస్ తనదైన శైలిలో చేసిన భక్త ప్రవచనాలతో భక్తులు దైవ చింతనలో తేలిపోయారు. భగవంతుడు ఉన్నదనే నమ్మకం ఉండాలని, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం తో ఉండాలని , నిత్యం భగవన్నామ స్మరణం చేస్తేనే మన జీవితం పవిత్రం అవుతుందని భక్త ప్రవచనాలు చేశారు. భగవంతుడు ఆత్మ లో ఉంటాడనీ, ఆయన్ను ఆత్మలో వెతకాలి గానీ, బయట కాదని భక్తులకు సూచించారు. కృష్ణుడు యొక్క లీలా వినోదం గురించి పాటల రూపంలో వివరించిన తీరు భక్తులను బహు చక్కగా ఆకట్టుకుంది. కృష్ణుడు బృందావనంలో…. వెంకటేశ్వరుడు ఆనందనిలయం లో కొలువయ్యారని , బృందావనం ఆనందవనం అయితే … తిరుమల ఆనంద నిలయం అని వర్ణించారు. హిందువులంతా దేశభక్తి,  దైవ భక్తి తో జీవించాలని, పైశాచిక మతాలకు, గ్రంథాలకు దూరంగ ఉండాలని కోరారు. వేదం.. ను రక్షించుకోవాలి. ఒకప్పుడు గోదావరి నదీ తీరం అంటే అగ్రహారాల నిలయం అన్నారు. పిల్లలకు చిన్న వయసు నుంచి వేదాలు గురించి తెలియజేయాలని, వేద శాల లకు పంపి వేద పండితులుగా తీర్చి దిద్దాలని, వేదశాలలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన కార్తీక మాసం విశిష్టత, హిందుత్వం గురించి బ్రహ్మర్షి ఆలపించిన భక్తి పాటలకు  భక్తులు గొంతు కలిపారు .  దీంతో పెళ్ళిళ్ళ గుడి ప్రాంగణం భగవన్నామస్మరణం తో   మారుమోగ హిందువులంతా ఐక్యంగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని పిలుపు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్య క్రమంలో స్థానిక వేద పండితులు, పెళ్ళిళ్ళ గుడి పాలక వర్గం, కార్యక్రమం నిర్వాహకులు, విశ్వ హిందు పరిషత్ సభ్యులు, ఆర్ ఎస్ ఎస్ కార్య కర్తలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply